calender_icon.png 20 April, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్‌లో ‘షైన్’ప్రభంజనం

20-04-2025 12:00:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 98.67 పర్సంటైల్ సాధించి కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలు సాధించినట్టు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్‌యాదవ్, డైరెక్టర్లు మూగుల రమ, పి.రాజేంద్రకుమార్, మూగుల రమేష్ తెలిపారు. శనివారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో షైన్ జూనియర్ కళాశాల జాతీయ స్థాయి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడమిక్ ప్రో గ్రామింగ్, ప్రణాళికల ద్వారా అద్భుతమైన ఆణిముత్యాలుగా తయారుచేసి జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. జాతీయ స్థాయిలో పర్సంటైల్ సాధించిన పి. శ్రీమహేష్ -98.67 (250310030686), జి. వికాస్ -98.59 (250310488959), సి.హెచ్.శ్రీతన్ -96.04 (250310037884) విద్యార్థులను అభినందించారు.

వీరితో పాటుగా 29 మంది విద్యార్థులు 90 పర్సంటైల్ పైగా ఫలితాలు సాధించారని చైర్మన్ మూగుల కుమార్‌యాదవ్ తెలిపారు. ఈ విజయాలకు తోడ్పడిన మా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్, ఐఐటీ కో-ఆర్డినేటర్ రమేష్‌యాదవ్, కళాశాలల ప్రిన్సిపల్స్ మారబోయిన రాజుగౌడ్, శ్రీనివాసన్, సంధ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.