23-04-2025 12:27:59 AM
వరంగల్ , ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఎం.పి.సి., బై.పి.సి. లో స్టేట్ ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలను సాధించడం జరిగిందని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగుల రమ, పి. రాజేంద్రకుమార్, షైన్ రెసిడెన్సియల్ స్కూల్ క్యాంపస్ డైరెక్టర్ జె.శ్రీనివాస్, ఐఐటి కో ఆర్డినేటర్ మూగుల రమేశ్ యాదవ్ మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉందని, ఇందుకు కారణమైన అధ్యాపక వర్గాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
షైన్ విద్యా సంస్థలు మొదటి నుంచి ఇంటర్ విద్యలో అత్యుత్తమ శిక్షణను వరంగల్లో అందించడం. జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి. అకాడమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళికల ద్వారా అద్భుతమైన ఆణిముత్యాలుగా తయారు చేసి, రాష్ట్ర స్థాయిలో ఎం.పి.సి. మొదటి సంవత్సరంలో ఎం. దీక్షిత 468 మార్కులు సాధించగా, కె. యశస్విని కుమారి 467 , కె.నిశాంత్ 467తోపాటు 11 నుంది విద్యార్థులకు 466 మార్కులు, 23 మంది విద్యార్థులకు 465 మార్కులు సాధించారని చెప్పారు. బైపిసి మొదటిసంవత్సరంలోఅకిబ్ ఆలి 437, సి.హెచ్. కీర్తన 436 సి. హెచ్, అజిత్రెడ్డి 435,
ఎం.డి.సాదుద్దీన్ 435 మార్కులు సాధించారని చెప్పారు. ద్వితీయ సంవత్సరం ఎం.పి.సి.లో డి.అనువర్షిణి 992 మార్కులు సాధించగా, జి. వికాస్ 991, భార్గవి వీరారెడ్డి 991, ఎం. వరుణ్ సందేశ్ 991, ఎం. రక్షిత 990 మార్కులు సాధించిందని తెలిపారు. బై.పి.సి.లో డి. ఇందు 991, కె.సహస్ర 991, వెంకట శివాణి 989, ఎం. రమ్య 989, టి. హాసిని 987, మార్కులు సాధించారని, వారిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీరితో పాటుగా ద్వితీయ సంవత్సరం ఎంపిసిలో 970 మార్కులకు పైగా 66 మంది విద్యార్థులు ఉండగా, బై.పి.సి.లో 960 కి పైగా 31 మంది విద్యార్ధులు ఉన్నారని చెప్పారు. అలాగే మొదటి సంవత్సరం ఎం.పి.సి.లో 460కి పైగా మార్కులు 67 మందికి, బైపిసిలో 10 మంది విద్యార్థులు 430మార్కులకు. పైగా సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో షైన్ -విద్యా సంస్థల డైరెక్టర్, ఐఐటి కో ఆర్డినేటర్ రమేశ్ యాదవ్, కళాశాలల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజుగౌడ్, కె.శ్రీనివాసన్, శ్రీమతి సంధ్య, ప్రశాంత్, అధ్యాపక బృందం, విదార్థులు పాల్గొన్నారు.