calender_icon.png 1 October, 2024 | 9:08 PM

అనుమానిత లింక్‌లు ఎవరూ క్లిక్ చేయొద్దు

01-10-2024 05:22:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాజస్థాన్ సైబర్ ముఠాపై దేశవ్యాప్తంగా సైబర్ నేరాల కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో 189, దేశవ్యాప్తంగా 2,223 కేసులు నమోదు కాగా, పెట్టుబడులు, ఫెడెక్స్ వంటీ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 27 మంది సైబర్ నేరగాళ్లు 29 నకిలీ ఖాతాల ద్వారా రూ.11.01 కోట్లు లూటీ చేశారు. నిందితుల నుంచి 31 సెల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు, 7 బ్యాంకు చెక్ బుక్స్, 2 హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ సైబర్ నేరగాళ్లు తెలంగాణలో 189 కేసుల్లో రూ.9 కోట్లు కాజేశారు. 

పోలీసుల నిఘా పెరగడంతో నగరాలు వదిలి గ్రామాలకు వెళ్లిన ముఠా మారుమూల గ్రామాల్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. అనుమానిత లింక్ లు ఎవరూ క్లిక్ చేయొద్దని, లింక్ లపై అనుమానం ఉంటే పోలీసులను ఆశ్రాయించాలన్నారు. దక్షిణ ఆసియా దేశాలు సైబర్ నేరాలకు హబ్ లా మారాయని, రాజస్థాన్ ముఠా రాష్ట్రంలో భారీగా సైబర్ నేరాలకు పాల్పడిందని సైబర్ సెక్యూరిటీ బ్యారో డైరెక్టర్ పేర్కొన్నారు. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారని శిఖా గోయల్ తెలిపారు.