calender_icon.png 27 October, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లు లేని స్కూళ్లకు టీచర్ల షిఫ్టింగ్

27-10-2024 01:41:31 AM

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): టీచర్లు కొరత ఉన్న ప్రభు త్వ పాఠశాలలకు టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్ల నుంచి షిఫ్టింగ్ చేయనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రైమరీ పాఠశాలలు.. ప్రాథమికోన్నత పాఠశాలలుగా, ప్రాథమికోన్న త పాఠశాలలు.. ఉన్నత పాఠశాలలు గా అప్‌గ్రేడ్ అయ్యాయి.

కొన్ని జిల్లా ల్లో కొత్తగా ప్రైమరీ పాఠశాలలను సైతం ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు. దీంతోపాటు కొన్ని పాఠశాల ల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్  తక్కువగా ఉంది, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఆ పాఠశాలలకు కొత్తగా టీచర్ పోస్టులు మంజూరు కాకపోవడంతో ఆయా పాఠశాలల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది.

దీనిపై దృష్టిసారించిన విద్యాశాఖ టీచర్ల రేషనలైజేషన్‌ను చేపడుతోంది. ఇందులో భాగంగానే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండి టీచర్ల కొరత తక్కువగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను షిఫ్టింగ్ చేయనున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.