calender_icon.png 24 December, 2024 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంచర్‌లోకి గొర్రెలు వెళ్లాయని కాపరులపై దాడి

02-11-2024 02:38:14 AM

నాగర్‌కర్నూల్‌లో రియల్టర్ల దాష్టీకం

నాగర్‌కర్నూల్, నవంబర్ 1(విజయక్రాంతి): వెంచర్ నుంచి గొర్రెల మంద వెళ్లిందని కొందరు రియల్టర్లు గొర్రెల కాపరులపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బొందలపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మేత కోసం తమ గొర్రెల మందను శుక్రవారం బస్ డిపో ప్రాంతం నుంచి నాగనూలు రోడ్డు వైపు ఉన్న వెంచర్ వైపు మళ్లించారు.

దీంతో కొందరు రియల్టర్లు తమ వెంచర్ల మీదుగా గొర్రెల మందను తీసుకెళాతారా? అంటూ గొర్రెల కాపరులపై కర్రలు, రాళ్లతో వెంటపడి దాడి చేశారు. దాడిలో కత్టె రాముడు, బాల్ చంద్రితో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.