calender_icon.png 10 March, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక ట్రాక్టర్ ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం..

10-03-2025 06:36:24 PM

మునుగోడు (విజయక్రాంతి): గొర్రెలను మేతకు తీసుకువెళ్తూ ఇసుక ట్రాక్టర్ ఢీకొని రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి (మహిళ) దుర్మరణం చెందిన సంఘటన మండల కేంద్రంలోని కమ్మగూడం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కచలాపురం గ్రామానికి చెందిన చిరగోని బాలమ్మ, భర్త నర్సింహా(58) రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ దగ్గరలో నివాసం ఉంటూ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నది.

సోమవారం ఆమె మునుగోడుకు చెందిన నారగోని నర్సింహాతో కలిసి గొర్రెలను తోలుకొని వెళ్తుండగా, మార్గ మధ్యలో కమ్మగూడెం శివారులో మునుగోడు నుండి వస్తున్న ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ దెందే మల్లేష్ అనే వ్యక్తి ట్రాక్టర్ ను అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ట్రాక్టర్ బాలమ్మను ఢీకొని సంఘటన స్థలంలోని దుర్మరణం చెందింది. మృతిరాలి కొడుకు చిరగోని లింగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ఇరుగు రవి తెలిపారు.