calender_icon.png 9 January, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధ ఆశ్రమంలో చేరేందుకు నిరాశ్రయులకు రాంపూర్ లో ఆశ్రయం

08-01-2025 05:32:01 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో గల సమస్త వయోవృద్దులకై ఆశ్రమము ఏర్పాటు చేశారు. 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దులకు వసతి కల్పించుటకుగాను డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ గ్రామం నందు రాష్ట్ర ప్రభుత్వము ద్వారా వృద్దాశ్రమమును నిర్మించబడింది. ప్రజాప్రతినిధుల, జిల్లా అధికారుల, వయో వృద్దుల పోషణ చట్టం జిల్లా కమిటీ సభ్యుల ఆద్వర్యంలో ప్రారంభించారు. ఈ వృద్దాశ్రమము నిర్వహాణకై జిల్లా యంత్రాంగము, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ ఒప్పందం చేశారు. వృద్దాశ్రమములో కేవలం నిరాశ్రయులైన వయో వృద్దులకు ఈనెల 10వ తేదీ నుండి వసతి కలిపించబడుతుందని తెలిపారు. 

తదుపరి జిల్లాలో గల వయోవృద్దుల పోషణ, చట్టం జిల్లా కమిటీ సభ్యులకు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, ఫోరమ్స్ ట్రస్టుల అధ్యక్షులకు, ఇతర సభ్యులను, సమగ్ర శిశు పథక అభివృద్ధి అధికాణిలకు, అంగన్వాడీ సూపర్వైజర్లను, అంగన్వాడీ టీచర్ లు నిరాశ్రయులైన వయోవృద్దులను రాంపూర్ లో గల ప్రభుత్వ వృద్దాశ్రమము నందు ఆశ్రయము కల్పించే అందుకు కృషి చేయాలని కోరారు. ఇతర వివరాలకై చైర్మన్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ ఫోన్ నం. 9849933300 లేదా వృద్దాశ్రమ కో-ఆర్డినేటర్ ఫోన్ నం. 96188 44461 లేదా జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ, నిజామాబాద్ కార్యలయంలో సంప్రదించాలని తెలిపారు.