calender_icon.png 12 February, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత శేఖర్‌రెడ్డికి లేదు

12-02-2025 12:00:00 AM

మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగి భువనగిరి నియోజకవర్గానికి ఏమి చేయలేని మాజీ ఎమ్మెల్యే ఫైళ్ళకు కాంగ్రెస్ పార్టీని  విమర్శించే స్థాయి లేదని ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు వలిగొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉండ లేని అతను పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడని మండి పడ్డారు.

టిఆర్‌ఎస్ పార్టీ కొంచెం వదిలేస్తే కాంగ్రెస్లో చేరే వాడని ఎద్దేవ చేశారు. ప్రజలకు మంచినీరు అందించే సోయి ఆనాడు ఆలేరు భువనగిరి మాజీ ఎమ్మెల్యేలకు ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. పూణే, దుబాయ్ నుండి సోషల్ మీడియా పెట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నామన్నారు. గతంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అరత లేదన్నారు.

తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పత్తి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని కోళ్ల గొట్టి కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి దివాలా తీయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయాలతో ఆర్థికంగా నిలబెడుతున్నారని ఓ్ంవలేక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారని అన్నారు. పుణె, దుబాయ్ నుండి సోషల్ మీడియా పెట్టుకొని టిఆర్‌ఎస్ నాయకులు పనికిరాని రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ సోదరులు 30 ఏళ్లుగా చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి రావలసిన న్యాయమైన వర్గీకరణను దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడ్డదన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు.

మూసిని ప్రక్షాళన చేయడానికి సీఎం ఎంతో శ్రద్ధతో ఉన్నారని బీసీ కులగన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో టిఆర్‌ఎస్ జరిపిన సమగ్ర కుటుంబ సర్వే కెసిఆర్ కుటుంబం కోసమే ఫామ్ హౌస్ కోసమే సర్వే చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. విలేకరుల సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థానిక నాయకులు పాల్గొన్నారు.