తెలంగాణ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్
హైదరాబాద్: పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(Para Athletics Association of Telangana) నూతన అధ్యక్షుడిగా డాక్టర్ శేఖర్ విస్లావత్(Dr. Shekar Vislavath) ఎంపికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రకటించింది. ఇక జనరల్ సెక్రటరీగా గాడిపల్లి ప్రశాంత్, కోశాధికారిగా ఉప్పునూతల రాజు ఎంపికయ్యారు. వీరితో పాటు అసోసియేషన్ అడ్వైజర్స్‌గా అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌తో పాటు తలారీ సంజీవయ్య, రాగుల నరేశ్, టెక్నికల్ కమిటీలో కబీర్ దాసు, కే.సురేశ్, కోచ్‌గా జాటోతు నాగరాజులను ఎంపిక చేశారు. ఇక నూతన పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 7వ తెలంగాణ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారులను వచ్చే నెల చెన్నైలో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు.