24-03-2025 01:38:43 AM
కోదాడ, మార్చి 23: కోదాడ పట్టణానికి చెందిన షేక్ రసూల్ మియా తమిళనాడు చెన్నై నందుగల డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, ఓరల్ ప్రంజంటేషన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 4వ ర్యాంక్ సాధించి పీ.హెచ్.డీ సీటు సాధించారు.
ఎంజీఆర్ యూనివర్సిటికి చెందిన డాక్టర్. ఎం.మహాలింగం, ప్రొఫెసర్& అడిషినల్ హెడ్ పర్యవేక్షణలో శారీరక దృఢత్వంపై మెడిసిన్ బాల్ శిక్షణ అధిక-తీవ్రత విరామ శిక్షణ యొక్క వివిక్త, మిశ్రమ ప్రభావాలు సంబంధించి పరిశోధన చేయనున్నట్లు తెలిపారు.
కో-గైడ్ గా హైదరాబాద్ సింబయోసిస్ యూనివర్సిటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.గోవిందస్వామి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రోత్సహించిన అన్నయ్య డాక్టర్ హస్సన్ జానికి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.