calender_icon.png 9 January, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేక్ హసీనా వీసా గడువు పొడిగింపు

09-01-2025 12:51:38 AM

న్యూఢిల్లీ, జనవరి 8: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్ట్‌ను అక్కడి ప్రభుత్వం రద్దు చేసిన వేళ.. భారత ఆమె వీసా గడువు పొడిగించడం చర్చనీయాంశమైంది. ఆమెపై బంగ్లాదేశ్ లో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ వారెం ట్లు సైతం జారీ అయ్యాయి. అక్కడి ప్ర భుత్వం ఆమెను అప్పగించాలని అనేకసార్లు భారత్‌ను కోరింది.

మంగళవారం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. హసీనాకు మరింతకాలం ఆశ్రయం ఇచ్చేందుకే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. కేంద్రం హోంశా ఖ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఫారిన ర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆమె వీసాను పొడించిందనేది వార్తల సారాంశం.

తిరుగుబాటు కారణంగా హసీనా స్వదేశాన్ని వీడి భారత్‌కు వచ్చి రహస్య ప్రాంత ంలో ఆశ్రయం పొందుతున్నారు. హసీనాను తమకు అప్పగిం చాలని బంగ్లా ప్రభుత్వం గత నెలలో దౌ త్య సందేశం పంపించింది. తాము ఎలాంటి వ్యాఖ్యలు చే యలేమని భారత  ప్రకటించడం గమనార్హం.