calender_icon.png 16 January, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పదవికి షేక్ హసీనా సోదరి కుమార్తె రాజీనామా

16-01-2025 02:05:20 AM

లండన్, జనవరి 15: బ్రిటన్ అవినీతి నిరోధకశాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యురాలు తులిప్ సిద్దిఖీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సోదరి రెహానా కుమార్తె. ఆమె లేబర్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో ముఖ్యనాయ కురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నటివరకూ మంత్రిగా సేవలందించారు.

బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా పాలనలో 12.65 బిలియన్ డాలర్ల అణువిద్యుత్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని అక్కడి ప్రభుత్వం అనుమానించింది. ఈ కేసులో బ్రిటన్ మంత్రి తులిప్ సిద్దిఖీ ప్రమేయం సైతం ఉన్నట్లు భావించి ఆమె పేరును దర్యాప్తులో చేర్చారు. దీంతో సిద్దిఖీపై బ్రిటన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.