calender_icon.png 30 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యూజియంగా షేక్ హసీనా బంగ్లా

30-10-2024 01:49:35 AM

మహ్మద్ యూనస్ ప్రకటన

విద్యార్థి ఉద్యమానికి గుర్తుగా మారుతుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసం ఉన్న అధికార భవనాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు ఆ దేశ ప్రభుత్వ సారధి మహ్మద్ యూనస్ పకటించారు. మాజీ ప్రధాని అధికార నివా సం అయిన గణభబన్ ప్యాలెస్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ షేక్ హసీనా హయాంలో విపక్ష నేతలను బంధించేందుకు ఆయ్నా ఘర్ డిటెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అచ్చం అదే తరహాలో ఓ గదిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మ్యూజియం బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ జ్ఞాపకాలకు గుర్తుగా మారనుందని పేర్కొన్నారు. భవనాన్ని మ్యూజియంగా మార్చే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని చెప్పారు. డిసెంబర్ నాటికి ఈ పనులు ప్రారంభించి, మాజీ ప్రధాని అధికారిక నివాసాన్ని ‘విప్లవ మ్యూజియం’గా మార్చనున్నట్లు వివరించారు.