ఢాకాలోని ప్రభుత్వ ఆసుపత్రి బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్శిటీతో సహా పలు కార్యాలయాలు, సంస్థలపై నిరసనకారులు దాడి చేశారు. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో బాంబులు, తుపాకుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరసనకారులు పలు వాహనాలను తగులబెట్టారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. తదనంతరం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..
మళ్లీ నిరసనలు వెల్లువెత్తడంతో బంగ్లా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 4G సేవలను నిలిపేయాలని తమకు ఆదేశాలు అందాయని ఫోన్ ఆపరేటర్ల అధికారులు తెలిపారు