calender_icon.png 16 January, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడబ్ల్యూడీ ఐకాన్లుగా శీతల్ దేవి, రాకేశ్

12-09-2024 12:50:26 AM

న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పారా ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)తో జతకట్టారు. త్వరలో జమ్మూకాశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ వీరిని పీడబ్ల్యూడీ (అంగవైకల్యం) ఐకాన్లుగా నియమించింది. బుధవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ కుమార్‌లను ఈసీ ప్రత్యేకంగా సన్మానించింది. కాగా పారాలింపిక్స్‌లో ఆర్చరీ మిక్సడ్ విభాగంలో శీతల్, రాకేశ్ కుమార్ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.