calender_icon.png 21 January, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శీతల్ అదుర్స్..

30-08-2024 12:00:00 AM

ప్రిక్వార్టర్స్‌కు భారత పారా ఆర్చర్

  1. భారత షట్లర్ల శుభారంభం 
  2. తైక్వాండోలో అరుణకు నిరాశ

పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌కు అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. పారా బ్మాడ్మింటన్‌లో ఒకరిద్దరు మినహా మిగతా షట్లర్లంతా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఇక పారా ఆర్చరీలో భారత ఆశాకిరణం శీతల్ దేవీ తన ఆటను ఘనంగా ప్రారంభించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో అదరగొట్టిన శీతల్ రెండో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపుతుంది. ఇక తైక్వాండోలో భారత్ నుంచి బరిలోకి దిగిన ఏకైక పారా అథ్లెట్ అరుణ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది.

విజయక్రాంతి, ఖేల్ విభాగం

ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్‌లో భారత అథ్లె ట్లు తమ జర్నీని ఘనంగా ఆరంభించారు.  రెండోరోజు ఆటలో మన పారా అథ్లెట్లు బ్యాడ్మింటన్, ఆర్చరీ, తైక్వాండో, వ్యక్తిగత పర్య్సూట్ విభాగాల్లో పోటీ పడగా దాదాపు అన్నింటిలోనూ సానుకూల ఫలితాలే వచ్చాయి.బ్యాడ్మింటన్‌లో పురుషుల విభాగంలో సుకాంత్, సుహాస్ యతిరాజ్, తరుణ్ ముందంజ వేయగా.. మహిళల విభాగంలో కోహ్లీ పాలక్, తులసిమతి దిగ్విజయాలు అందుకున్నారు. ఇక పారా ఆర్చరీలో మహిళల విభాగంలో శీతల్ దేవీ, సరితా ర్యాంకిం గ్స్ రౌండ్‌లో అదరగొట్టారు. తైక్వాండోలో భారత్ నుంచి బరిలోకి దిగిన ఏకైక పారా అథ్లెట్ అరుణ తొలి రౌండ్‌లో ఓటమిపాలవ్వగా.. మహిళల 3000 మీ సీధే1 వ్యక్తిగత పర్స్యూట్‌లో భారత అథ్లెట్ గడేరియా జ్యోతి ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. 

తైక్వాండోలో నిరాశ

పారా తైక్వాండోలో భారత్ నుంచి బరిలో నిలిచిన ఏకైక అథ్లెట్ అరుణ నిరాశపరిచింది. మహిళల కె44 కేజీల ప్రిలిమినరీ రౌండ్‌లో అరుణ 0 తుర్కియేకు చెందిన ఎకిన్సీ నుర్చిహాన్ చేతిలో పరాజయం చవిచూసింది. మ్యాచ్ లో ఒక్క పాయింట్ కూడా గెలవకపోవడంతో అరుణ రెపీచేజ్ రౌండ్‌కు కూడా అర్హత సాధించడంలో విఫలమైంది. పారా సైక్లింగ్ ట్రాక్ విభాంలో మహిళల సీ 3000 మీ వ్యక్తిగత పర్య్సూట్‌లో భారత్ నుంచి బరిలోకి దిగిన జ్యోతి 4 నిమిషాల 53. 929 సెకన్లతో పదో స్థానంతో సరి పెట్టుకుంది.