వేములపల్లి: నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు రోడ్డు దాటుతున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 2 లక్షల నష్టం వాటిల్లినట్టు గొర్రెల కాపరుల ఆవేదన వ్యక్తం చేశారు.నారాయణపేట జిల్లా కొల్లంపల్లి గ్రామం నుంచి మెపుకోసం గొర్రెలను కాపరులు తోలుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.