calender_icon.png 30 April, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల దొంగలను కఠినంగా శిక్షించాలి

29-04-2025 12:00:00 AM

తుర్కయంజాల్, (ఏప్రిల్ 28):తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో గొర్రెల కాపరిని కత్తులతో బెదిరించి సుమారు 70 గొర్రెలను ఎత్తుకెళ్లిపో యారు. తండ్రి అందుబాటులో లేకపోవడం తో గొర్రెలకు కాపలాగా అతని కుమారుడు,కానిస్టేబుల్ రాసూరి నవీన్ ఉన్నారు. దుండగుల దాడిలో నవీన్ కత్తిపోట్లకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న బీఎస్పీ నేతలు ఘటనాస్థలాన్ని సందర్శించారు.

బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ మున్సిపల్ అధ్యక్షుడు పట్నం రమేష్ కురుమ మాట్లాడుతూ వారం క్రిత మే ఇదే గ్రామంలో దుండగులు 30 గొర్రె లు ఎత్తుకెళ్లిపోయారని, మళ్లీ ఇప్పుడు అ లాంటి ఘటనే జరగడం బాధాకరమన్నారు. దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ  ఉపాధ్యక్షులు లపం గి రాజు, కోహెడ సెక్టార్ అధ్యక్షులు శీలం అంగద్ కుమార్, 2 వార్డు అధ్యక్షులు ఏర్పు ల రవి కుమార్, సీనియర్ నాయకులు డా. యడవల్లి శ్యామ్, ఆలె మల్లేష్, సుబ్బురి రాఘవేందర్, నెలకంటి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.