11-04-2025 10:14:21 AM
ఆరు గొర్రెల మృతి
ఎమ్మెల్యే ఆదుకోవాలని వేడుకోలు
రాజాపూర్: మండల పరిధిలోని తిరుమలాపూర్(Tirmalapur) గ్రామంలో గొర్రెలను కుక్కలు వేటాడిన సంఘటనలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి జల్లికట్టిన గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనపై గొర్రెల కాపలాదారుడు కొల్లూరు పెద్ద రాములు కి తీర విషాదాన్ని మిగిలింది. ఎండనక్క వాననక శ్రమించి కాపాడుకుంటున్న గొర్రెలపై ఒక్కసారిగా అర్ధరాత్రి కుక్కలు దాడి చేయడంతో చేసిన కష్టం వృధా అయ్యిందని గొర్రెల కాపలాదారుడు తీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గొర్రెల మందను ఊరు బయట దొడ్డిలో తొలి రాత్రి సమయంలో ఇంటి దగ్గర వెళ్లారు.
అదే రాత్రి వీధి కుక్కలు గొర్రె మందల్లో చొరబడి ఆరు గొర్రెల గోతులు కొరికి కొరికి దారుణంగా చంపివేశాయి .ఉదయం గొర్రెల కాపరి మందలో చూడగా ఆరు గొర్రెలు మృతి చెందాడంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. గ్రామంలో వీధి కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. వీధి కుక్కల వల్ల పశువుల తో పాటు, మనుషులపై ,చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. వీధి కుక్కల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం కొల్లూరు పెద్ద రాములు ఆర్థికంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) ఆదుకోవాలని కోరుతున్నారు.