21-04-2025 12:16:35 AM
విరిగిపడ్డ చెట్లు
గాలి బీభత్సానికి కొట్టుకుపోయిన రేకులు
గోపాలపేట ఏప్రిల్ 20: ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపాటుకు 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గోపాలపేట మండలంలో ఒక్కసారిగా గాలి దుమారం భీభత్సం కావడంతో లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన విశ్వనాథ్ రైతు గొర్రెలను మేపడానికి అడవికి వెళ్ళాడు.
గొర్రెల ను సాయంకాలం ఇంటికి తిరిగి తీసుకొస్తున్నాడు. అట్టి ప్రయాణంలో సాయంకాలం ఒక్కసారిగా గాలి దుమారం లేచి మెరుపులతో కూడిన పిడుగు పడింది దీంతో తనకున్న 26 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా విశ్వనాథ్ ప్రాణాపాయం తప్పింది .ప్రభుత్వం స్పందించి బాధితుని ఆదుకోవాలని కోరుతున్నారు