హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఏసీబీ కార్యాలయంలో గొర్రెల పంపిణీ కుంభకోణంలో గురువారం విచారణ చేపట్టింది. బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి రైతులు వెళ్లారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో రైతులు బాధితులుగా ఉన్నారు. ఐదుగురు రైతుల స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు రూ.700 కోట్లు కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో వెల్లడైంది.