03-04-2025 01:11:45 AM
* మంత్రి పొంగులేటి ఇలాఖాలో డీసీసీబీ బ్యాంక్ అధికారుల నిర్వాకం
* అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న రైతులు
కూసుమంచి, ఏప్రిల్ 2 :-ఆ బ్యాంక్ కు ఆ రైతు ఉన్న అప్పు 50 వేలు..ఇప్పటికే 30 వేలు వరకు ఈఎంఐ రూపంలో కట్టాడు.. ఇంకా బ్యాంకుకు అప్పుగా కట్టాల్సిన 20 వే లు కట్టడానికి సమయం అడిగితే బ్యాంక్ ఉద్యోగులు ఏకంగా ఇంటి మీదకు వెళ్లి ఇంట్లో గొర్రెలని అప్పు కింద జప్తు చేసి జీప్ లో ఎక్కించుకొని వెళ్ళిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాలు ఇలా ఉన్నాయి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం లోని కూసుమంచి మండలం గోరిలా పాడు తండాలో ఇది జరిగింది.
తండాకు చెం దిన ఓ రైతు గత ఏడాది ముద్ర లోన్ లో 50 వేలు అప్పు తీసుకున్నాడు.. ప్రతి నెల 2500 ఈఎంఐ కడుతూనే ఉన్నాడు.. గత ఆరు నెలలుగా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక నెల నెల కట్టాల్సిన ఈఎంఐ ఆగిపోవడంతో కూసుమంచి మండల కేంద్రం లోనీ డీసీసీబీ బ్యాంక్ ఉద్యోగులు రంజాన్ పండు గ రోజున (ప్రభుత్వం సెలవు దినం) రైతు ఇంటికి వెళ్లి అప్పు కట్టాలని అడగగా తమ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పడుతున్నామని,లోన్ డబ్బులు కట్టడానికి మరింత సమయం కావాలని అడిగాడు.
కనికరంలేని ఆ బ్యాంక్ ఉద్యోగులు తమ అధికార జులుంను చూపించారు.. వెంటనే రైతుకు చెందిన గొర్రెలను అప్పు కింద జప్తు చేసి తమ వాహనంలో గొర్రెలను తీసుకెళ్లారు .. రైతు తన గొర్రెలను కాపాడుకోవడం కోసం మరో దగ్గర అప్పు చేసి బ్యాంక్ కు డబ్బులు కట్టాడు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చిన్న చిన్న అప్పులకు రైతుల్ని వేధిస్తూ ఇలా ఆస్తులను జప్తు చేయ డం విస్మయానికి గురి చేస్తుందని .. వేలకు వేల కోట్ల రూపాయల బ్యాంకులకు అప్పులు ఉన్న వ్యక్తులకు మాత్రం రాచ మర్యాదలు చూపిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉన్న ఘటనలు కోకొల్లలు అంటున్నారు .. ఇలా చిన్న రైతులపై తమ అధికార జులుం చూపించడం బ్యాంకు అధికారులకు పరిపాటిగా మారిందని మండల ప్రజలు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.. బ్యాంకులో రైతులకు అప్పులు ఇచ్చాక వాటిని రైతులు తీర్చలేకపోతే నోటీసులు ఇవ్వాలి కానీ ఇలా ఆస్తుల జప్తులు చేసే అధికారం బ్యాంక్ ఉద్యోగులకు ఎక్కడిదని రైతులు నిలదిస్తున్నారు.. ఇలాంటి ఘటనలు మరల జరగకుండా బ్యాంక్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.