calender_icon.png 23 January, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శెభాష్ సహజ

02-07-2024 12:05:00 AM

  • అమెరికాలో అదరగొట్టిన తెలుగమ్మాయి 
  • ఐటీఎఫ్ టైటిల్ సొంతం

తెలంగాణ నుంచి మరో టెన్నిస్ రాకెట్ దూసుకొస్తోంది. సానియా మీర్జా చూపిన బాటలో వడివడిగా అడుగులు వేస్తున్న ఆ యువకెరటం పేరు యామలపల్లి సహజ. లాస్‌ఏంజిల్స్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో దుమ్మురేపిన సహజ.. కెరీర్‌లో నాలుగో అంతర్జాతీయ టైటిల్ ఖాతాలో వేసుకోవడంతో పాటు.. జాతీయ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. 

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ.. ఐటీఎఫ్ టైటిల్ కైవసం చేసుకుంది. లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన యూఎస్‌ఏ 26ఏ టోర్నీలో సహజ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సహజ 6 7 (7/4)తో జూ అమీ (అమెరికా)పై విజయం సాధించింది. ప్రస్తుతం మహిళల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి రెండో స్థానంలో ఉన్న సహజ.. అమెరికా టోర్నీ ఆసాంతం రాణించింది. తుదిపోరులో తొలి సెట్‌ను సునాయాసంగానే చేజిక్కించుకున్న సహజకు.. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే ఒత్తిడిలోనూ సంయమనం పాటించిన సహజ 7 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో మూడింటిని గెలుచుకొని ముందంజ వేసింది.

ఈ పోరులో సహజ మొత్తం 82 పాయిమట్లు సాధించగా.. ప్రత్యర్థి 70 పాయింట్లకు పరిమితమైంది. వరుసగా మూడు గేమ్స్ నెగ్గిన సహజ.. ఒక టైబ్రేకర్‌లో సత్తాచాటి చాంపియన్‌గా అవతరించింది. సహజ కెరీర్‌లో ఇది నాలుగో అంతర్జాతీయ ఐటీఎఫ్ టైటిల్ కాగా.. ప్రస్తుతం ఐటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో 300వ ర్యాంక్‌లో ఉన్న సహజ.. త్వరలోనే దాన్ని మరింత మెరుగు పర్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోనే టెన్నిస్ ఓనమాలు నేర్చుకున్న సహజ.. ప్రస్తుతం అమెరికాలో వరుస టోర్నీల్లో పాల్గొంటే మరింత రాటుదేలే ప్రయత్నం చేస్తున్నది. తాజా ఐటీఎఫ్ టోర్నీ విషయానికి వస్తే.. సహజ ఒక్క సెట్ కూడా కోల్పోకుండానే టైటిల్ గెలుచుకోవడం మరో విశేషం.

సెమీఫైనల్లో 6 6 రాచెల్ గైలిస్‌పై గెలిచిన సహజ.. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో 6 6 కేట్ ఫకీపై, ప్రిక్వార్టర్స్‌లో 6 6 క్లారా కోసన్‌పై విజయాలు సాధించింది. అత్యంత హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌లో సహజ 7 (7/1), 7 (7/4)తో ఎలీస్ వాగ్లేపై గెలుపొందింది. మొదటి పోరులోనే రెండు టై బ్రేకర్లు ఆడి సత్తాచాటిన సహజ.. ఆ తర్వాత ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయి.. చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో సహజకు ట్రోఫీతో పాటు రూ.12 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.