calender_icon.png 15 November, 2024 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యకై ఫిలిప్పీన్స్ వెళ్లి..

15-11-2024 12:40:11 PM

పుట్టినరోజు నాడే విద్యార్థిని అనుమానాస్పద మృతి...

పటాన్చెరు (విజయక్రాంతి): వైద్య విద్యను అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన పటాన్చెరు ప్రాంతంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృత్ రావు కుమార్తె చింత స్నిగ్ధ (17) ఫిలిప్పీన్స్ దేశంలోని పర్పెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ మనీలాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే స్నిగ్ధ పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందినట్లు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్నిగ్ధ చనిపోయినట్లు అక్కడ తోటి విద్యార్థినిలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని మృతి వార్తతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.  మృతురాలు స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.