రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మండిపాటు
ఖమ్మం, నవంబర్ 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుల చేతులకు బేడీలు వేసిన వారికి రైతుల గురించి మాట్లా డే నైతికత లేదని హరీశ్‌రావును ఉద్దేశించి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మండిపడ్డారు. శుక్రవారం ఖమ్మంలోని జిల్లా కాం గ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడారు.
సమయం సందర్భం లేకుండా పొద్దునే మా ర్కెట్‌కు వెళ్లి, రైతులెక్కడా అని వెతుక్కుంటున్నారన్నారు. రైతులు పొద్దున్నే రారన్న సంగ తి కూడా బీఆర్‌ఎస్ నాయకులకు తెలియదా అన్నారు. పోలీస్ రక్షణతో బయట తిరుగుతున్న మాజీ మంత్రిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.
మంత్రిగా ఆయన హయాం లో ఎంతో దోచుకున్నారని, మట్టి గుట్టలన్నీ స్వాహా చేసిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. పోలీస్ రక్షణ లేకుండా ప్రజల్లో తిరిగే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి పువ్వాడపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కష్టపడి పని చేస్తూ నిధులు సమకూర్చి, హామీ లను అమలు చేసేందుకు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నా యన్నారు.
10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నందుకే కేసీఆర్‌ను ప్రజలు ఇంటిదారి పట్టిం చారని దుయ్యబట్టారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే మూసీ ప్రక్షాళన చేపట్టామని రేణుకాచౌదరి అన్నారు. తాను ఖమ్మం జిల్లాకు శాశ్వత ఆడబిడ్డనని ఆమె అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని చెప్పుకొచ్చారు.