27-03-2025 12:00:00 AM
మందమర్రి, మార్చి 26: మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసమే షీటీంలు పని చేస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని షీ టీమ్ సభ్యులు కోరారు. పట్ట ణంలోని శివాని ఉన్నత పాఠశాలలో బుధవారం షీ టీం పనితీరుపై పాఠశాల విద్యా ర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.
ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడమే షి టీం కర్తవ్యమని, సమస్య వస్తే వెంటనే 6303923700 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పం దించి సహాయం చేస్తాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ నేరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్, షీ టీం సభ్యులు మహిళ కానిస్టేబుల్ పాల్గొన్నారు.