calender_icon.png 3 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల భద్రత కోసమే షీ టీం

28-03-2025 12:42:26 AM

-మోర్గి మోడల్ పాఠశాలలో సైబర్ నేరాలు, బెట్టింగ్ యాప్స్ పై అవగాహన 

నాగల్ గిద్ద, మార్చి 27 : నాగల్ గిద్ద మండలం మోర్గి మోడల్ స్కూల్ పాఠశాలలోవిద్యార్థులకు షీ టీం నారాయణఖేడ్ డివిజన్ ఇంచార్జ్ ఏఎస్‌ఐ తులసిరాం , హెడ్ కానిస్టేబుల్ రవీందర్ ,కానిస్టేబుల్ చాంగుబాయి లు య అవగాహన కల్పించారు. షీ టీం తెలంగాణ రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడం, ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేస్తామన్నారు .

అపరిచితులు నుంచి ఫోన్ల నుంచి వేధించిన వేధింపులకు గురి చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి కాల్ చేయాలని తెలిపారు. నారాయణఖేడ్ డివిజన్ షి టీం ఇంచార్జ్ ఏఎస్‌ఐ తులసిరం ఫోన్ నెంబర్ నెం 94926 51635, చంగు బాయి 9121610750 ఫోన్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సువర్ణ , విద్యార్థులు పాల్గొన్నారు.