calender_icon.png 24 October, 2024 | 7:52 AM

కోదాడలో పోకిరిలపై షీటీం నజర్

29-08-2024 03:31:01 PM

మహిళల వేధింపులపై ప్రత్యేక దృష్టి

హత్యాచారాలపై నిఘా

మైనర్ బాలికలను వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు 

షీ టీం ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే

పాల్గొన్న జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

కోదాడ, (విజయక్రాంతి): ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సూర్యాపేట జిల్లా కోదాడలో పోకిరిగాళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. కోదాడలో ఉన్న కాలేజీలు, స్కూల్స్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి షీ టీం కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మహిళల వేధింపులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, అత్యాచారాలపై, మైనర్ బాలికల వేధింపులపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.

ప్రతి కాలేజీల వద్ద, స్కూల్స్ ల వద్ద ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, ఆ ప్రాంతంలో పోలీసులు ఉంటారని తెలిపారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ... కోదాడకు షీ టీం కార్యాలయం రావడం అభినందనీయమని తెలిపారు. కోదాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అత్యాచారాలు, జరగకుండా అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు, డి.ఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి, టౌన్ సిఐ రాము, మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్సైలు, సిబ్బందులు, తదితరులు పాల్గొన్నారు.