calender_icon.png 4 March, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు షీ టీంను ఉపయోగించుకోవాలి

03-03-2025 07:28:57 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యార్థులకు షీ టీంను ఉపయోగించుకోవాలని తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లు(Tadvai SI Venkateshwarlu) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన షీ టీం అవగాహన సదస్సు(She Team Awareness Conference)లో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యార్థినులకు ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు స్పందించకూడదని వెల్లడించారు. ఎవరైనా ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడిన షీ టీంను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం నిర్వాహకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.