- రైతులను దగాచేసి విజయోత్సవాలా?
- మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ చెప్పింది కొండంత, ప్రభుత్వంలోకి వచ్చాక చేసింది గోరంత అని మాజీ మంత్రి హరీశ్‌రావు మం డిపడ్డారు. ఏడాదిగా రైతులను దగాచేసి, రైతు పండగ పేరిట విజయో త్సవాలు జరపడం సిగ్గుచేటనన్నారు.
రైతులకు బాకీ పడ్డ రూ.40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసాను కూడా వెంటనే విడుదల చేసి పండ గ చేసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చే సినందుకు రైతు పం డగ పేరిట మూడు రోజుల విజయోత్సవాలు నిర్వహిస్తారా అని ప్రశ్నిం చారు.
ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కో ల్పోయారని తెలిపారు. ఏడాది పాలనలో రైతు సంక్షేమానికి రూ. 54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉందన్నారు.