- గ్రేటర్‌లోని మహిళా హాస్టళ్లలో సెక్యూరిటీ లోపాలు
- మంగళపల్లిలో లైంగికదాడి, సీఎంఆర్ కళాశాలలో వీడియోలపై జనాగ్రహం
- పర్యవేక్షణ పట్టని అధికారులు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
మేడ్చల్, జనవరి 17: గ్రేటర్ పరిధిలోని ప్రైవేట్ వసతి గృహాల్లో మహిళలకు రక్షణ కరువైంది. 15 రోజుల వ్యవధిలో హాస్టళ్లలో రెండు ఘటనలు జరగడం రక్షణ లోపాలకు అద్దం పడుతోంది. మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలకు సంబంధించి విద్యార్థినుల ఆందోళన మరువకముందే ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి మంగళపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో విద్యార్థినిపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడటం విస్మయం కలిగిస్తోంది.
ఈ హాస్టల్‌లో ఎలాంటి రక్షణ చర్యలు లేనందున నిందితుడు నేరుగా గదిలోకి వెళ్లినట్లు సమాచారం. అయితే వరుస సంఘటనలతో తమ పిల్లల్ని హాస్టళ్లలో ఉంచడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రక్షణకు సంబంధించి నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు.
నిబంధనల ప్రకారం వార్డెన్లుగా మహిళలనే నియమించాలి. వంట మనుషులు, సహాయకులుగా మహిళలను లేదా వయసు పైబడిన వారిని నియమించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని హాస్టల్లో పురుషులు వార్డెన్లుగా ఉన్నారు. వంట మనుషులుగా, సహా ఇతర రాష్ట్రాల యువకులను నియమించారు. ఎవరు, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి అనేది చూడకుండా వారిని పనిలో చేర్చుకొని అదే హాస్టల్‌లో వసతి కల్పిస్తున్నారు.
రక్షణ బాధ్యత నిర్వాహకులదే..
హాస్టళ్లలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదే. గతంలో హైకోర్టు కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. కానీ నిర్వాహకులు తమ బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మే సీఎంఆర్ హాస్టల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులను వంట మనుషులుగా పెట్టుకుని విద్యార్థినుల బాత్రూం వద్ద గదు కేటాయించారు.
వెంటిలేటర్ వద్ద నీడ కనిపిస్తోందని విద్యార్థినిలు అనేకసార్లు విన్నవించినా వార్డెన్లు, కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదు. చివరికి విద్యార్థులు ఆందోళన చేయడమే గాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వెంటిలేటర్ నుంచి తొంగి చూసినట్టు బీహార్ యువకులు అంగీకరించగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
పుట్టగొడుగుల్లా హాస్టళ్లు..
గ్రేటర్ పరిధిలో ప్రైవేట్ వసతి గృహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. హాస్టల్ ఏర్పాటు చేయాలంటే ముందుగా మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీ, పోలీస్, అగ్నిమాపక తది శాఖల నుంచి విధిగా అనుమతి తీసుకోవాలి. అయితే ఇలాంటివేవీ తీసుకోకుండానే హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నారే విమర్శలున్నాయి. విద్యార్థుల వద్ద ప్రతినెల పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇరుకైన గదులు, శిథిల భవనాల్లో హాస్టళ్ల్లు ఏర్పాటు చేస్తున్నారు.
తనిఖీలు పట్టని అధికారులు..
నగరంలో కాలేజీల హాస్టల్లు, ప్రైవేట్ హాస్టళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిని నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికారులు అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నిర్వాహకులు ఇచ్చే మామూ కక్కుర్తి పడి అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. మేడ్చల్‌లోని సీఎంఆర్ ఘటన రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.
ఈ ఘటన తర్వాత కూడా అధికారులు హాస్టలను పరిశీలించడం లేదు. ఇప్పటికైనా హాస్టల్లో నిబంధనలు అమలయ్యేలా చూడాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
హాస్టల్ నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు
* ప్రతి హాస్టల్ యాజమాన్యం తమ వివరాలను తప్పనిసరిగా మున్సిపల్ లేదా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
* మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక విభాగాల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి.
* రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పా చేయాలి.
* అగ్నిమాపకపరికరాలుఏర్పాటు చేయాలి.
* మహిళలు, విద్యార్థినులు లోపలికి, బయటకు వచ్చే సమయాలు నమోదు చేయాలి.
* హాస్టళ్లలో పురుషులను అనుమతించ
* ప్రథమ చికిత్స కిట్లు, మందులు, మంచినీరు అందుబాటులో ఉంచాలి.