calender_icon.png 28 April, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెది ముక్కుసూటి మనస్తత్వం!

27-04-2025 12:00:00 AM

మీనాక్షి శేషాద్రి.. అసలు పేరు శశికళ శేషాద్రి. చిన్నతనం నుంచి కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సి లాంటి డ్యాన్సులలో ప్రావీణ్యం సాధించింది. ఢిల్లీలో చదువుకునే సమయంలోనే మిస్ ఇండియాలో పాల్గొని ఎంపికయింది. ఇక మోడల్‌గా అవకాశాలు రావడంతో.. హీరోయిన్‌గా అగ్రస్థానానికి చేరుకుంది. అలా ఇండస్ట్రీకి దగ్గరైంది. 

పెయింటర్ బాబు సినిమాలో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని ఒక్కరోజులోనే స్టార్ స్టేటస్ అందుకుంది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రాజేష్ ఖన్నా, సన్ని డియోల్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.

అంతేకాదు మీనాక్షి 1980 లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటి. తెలుగులోనూ మోగాస్టార్ చిరంజీవి తో ఆపద్బాంధవుడు సినిమాలో కలిసి నటించిం ది. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన విశ్వామిత్ర మూవీలో మేనక పాత్ర పోషించింది. 

నటనలోనే కాదు మాటలోనూ ఆమె ముక్కుసూటి మనస్తత్వం కలిగిన నటి. అదే కొన్నిసార్లు ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆమె కెరీర్‌ను అర్ధాంతరంగా ఆగిపోయేలా చేసింది. మీనాక్షి 1990లో ఘాయల్ చిత్రం కోసం దర్శకుడు రాజ్ కుమార్ సంతోషితో కలిపి పనిచేసింది. దామిని సినిమాలో మీనాక్షి టైటిల్ రోల్‌ను పోషించగా, రిషి కపూర్, సన్నీ డియోల్ సహాయక పాత్రల్లో నటించాల్సి ఉంది.

కానీ సినిమా ప్రారంభం అవుతుండగా రాజ్ కుమార్ సంతోషి మీనాక్షితో పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. కానీ మీనాక్షి నిరాకరించింది. ఆతర్వాత మీనాక్షిని రాజ్ కుమార్ సంతోషి నిరంభ్యతరంగా రెండో ఆలోచన లేకుండా సినిమా నుంచి తొలగించారు. ఇది పరిశ్రమకు షాకిచ్చింది.

అయితే చివరికి ఆర్టిస్ట్స్ గిల్డ్, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇన్వాల్వ్ అయ్యి మీనాక్షికి మద్దతుగా నలిచి చట్టవిరుద్దమైన తొలగింపు ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి రాజ్ కుమార్ సంతోషి వెనక్కి తగ్గాడంతో దామినిలో మీనాక్షి నటించింది. ఆ సినిమా విమర్షకుల ప్రశంసలు పొందడమే కాక, కమర్షియల్‌గా హిట్ సాధించింది. 

హీరోలతో పోలిస్తే..

హీరోయిన్‌లతో పోలిస్తే హీరోల సుదీర్ఘ కెరీర్‌కు కారణం ఏంటో మీనాక్షి వివరించారు. ‘ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆ తరానికి చెందిన నటులు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కథానాయికలతో పోలిస్తే హీరోలకు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కెరీర్ ఉండటానికి చాలా కారణాలున్నాయి.

ఇంటి పనులు చేసేది పురుషులు కాదు. ప్రెగ్రెన్సీ, పిల్లలకు జన్మనివ్వడం, పిల్లలను పెంచడం వంటి విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ స్త్రీ బాధ్యతలు. హీరోలకు ఎంత వయసు వచ్చినా తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు’ అని మీనాక్షి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

అమెరికాలో సెటిల్..

మీనాక్షి తన 13 ఏళ్ల కెరీర్‌లో 70 సినిమాల్లో నటించారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమయ్యారు. భర్త, ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం అమెరికాలో గడుపుతున్నారు. 

కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ..

2016లో విడుదలైన ‘గాయల్ వన్స్ అగైన్’ లో మీనాక్షి శేషాద్రి అతిథి పాత్రలో కనిపించారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న మీనాక్షి.. 60 ఏళ్ల వయసులోనూ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తాజాగా లెహరెన్ రెట్రోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని’ చెప్పారు.