calender_icon.png 12 January, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెకు 102.. ఆయనకు 100

08-12-2024 12:45:08 AM

*  సెంచరీ దాటాక ఒక్కటైన ప్రేమజంట

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: యుక్త వయస్సు లో ప్రేమలో పడ్డారు. పెండ్లి చేసుకోవడం కుదరలేదు. ఎవరి దారిలో వారు వెళ్లారు. రాసిఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్లు వీరు తమ వయసు వందేడ్లు దాటిన తర్వాత పెండ్లి చేసికొని దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే వృద్ధ దంపతులు గా గిన్నిస్ రికార్డులకెక్కారు. ఫిలడెల్ఫియాకు చెందిన బెర్నీ లిట్‌మెన్(100), మార్జోరి ఫిటర్‌మాన్ (102) ఈ ఏడాది మే 19న పెండ్లి చేసుకున్నారు.

డిసెంబర్ 3నాటికి వీరి ఉమ్మ డి వయసు 202 రోజుల 271 రోజులు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వయసున్న దంపతులుగా గిన్నిస్ రికార్డు సాధించారు. వీరు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. వివిధ కారణాల వల్ల పెండ్లి చేసుకోవడం కుదరలేదు. వేర్వేరు వ్యక్తులను పెండ్లి చేసుకుని బెర్నీ ఇంజినీర్‌గా, మార్జోరి టీచర్‌గా స్థిరపడ్డారు. తమ జీవిత భాగస్వాముల మరణా నంతారం ఒంటరిగా ఉంటున్న వీరు తొమ్మిదేండ్ల కింద అనుకోకుండా కలుసుకున్నారు.