నర్గీస్ దత్.. ఒక విలక్షణమైన నటి. ఆమె చేసిన ఏ పాత్రలోనైన ఒదిగిపోయేది. అందుకే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నటిగానే కాదు.. వివిధ కార్యక్రమాల ద్వారా సమాజానికి ఎన్నో సేవలందించింది. మూడు దశాబ్దాలపాటు సినీ ప్రేక్షకులను అలరించినందుకుగాను భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కుమారుడు సంజయ్ దత్.. నర్గీస్ దత్ జీవితం ఆధారంగా ‘సంజు’ అనే మూవీ తెరకెక్కింది.
నర్గీస్‌వన్నీ క్లాసికల్ హీట్సే. నర్గీస్ అసలు పేరు ఫాతిమ రషీద్. తల్లి సినీ పరిశ్రమలో ఉండటం ద్వారా ఐదేళ్లు నిండగానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా బాల్యనటిగా ‘బేబి నర్గీస్’ పేరుతో ‘తలాష్-ఇ-హక్’ మూవీలో నటించింది. ఇక అప్పటి నుంచి అదే పేరుతో నటి గా కొనసాగింది. తర్వాత ‘తమన్నా’, ‘తక్దీర్’ సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయి.
అప్పటికి నర్గీస్ వయసు 14 ఏళ్లు మాత్రమే. తర్వాత బాబుల్, ఆవారా, శ్రీ 420, దీదార్, అందాజ్, ఆహ్, జోగన్, అనోఖా ప్యార్, ఆగ్, జాగ్తే రహో, బర్సాత్, బేవఫా, చోరీ చోరీ, పర్దేశి, ఘర్ సంసార్ మొదలైన చిత్రా ల్లో నటించింది. అప్పట్లో ఈ సినిమాలు గొప్ప క్లాసిక్స్ హిట్స్‌గా నిలిచాయి. ‘ఆహ్’ సినిమాను తెలుగులో ‘ప్రేమలేఖలు’ పేరు తో విడుదల చేశారు.
రాజ్‌కపూర్, నర్గీస్.. వీరి ప్రేమాయణం గురించి అప్పట్లో అందరూ కథలుకథలుగా చెప్పుకునేవాళ్లు. 18 చిత్రాల్లో కలిసి నటించిన వీరికి ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ. కానీ అప్పటికే రాజ్ కపూర్‌కు పెళ్ల యి, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ ప్రేమ సఫలం కాలేదు. తర్వాత రాజ్ కపూర్‌తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.
1957లో ‘మదర్ ఇండియా’ సినిమాలో నర్గీస్ నటించిన రాధ పాత్రలోని నటనకుగాను ఫిలింఫేర్ అవార్డును అందుకున్నది. షూటింగ్ సమయంలోనే సునీల్ దత్ నర్గీస్‌తో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నర్గీస్ అంగీక రించడంతో సునీల్ దత్‌ను పెళ్లి చేసుకుని హిందూ మతాన్ని స్వీకరించింది. వీరికి ముగ్గురు పిల్లలు.. సంజయ్ దత్, నమ్రత, ప్రియాదత్.
సామాజిక కార్యక్రమాలు
నర్గీస్, సునీల్‌దత్ సినీ రంగంలోనే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో విశిష్టమైన, విలక్షణమైన సేవలు అందించారు. ఇద్దరు కలిసి ‘అజంతా కల్చరల్ ట్రూప్’ను ప్రారంభించి.. ఇండియన్ ఆర్మీకి వినోదాన్ని అందించారు. సినీనటులు, సంగీత గాయకులను ఏకం చేసి స్టేజ్ షోలు చేయించేవారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం సందర్భంగా ఢాకా నగరంలో మొదటి ప్రదర్శనిచ్చారు.
తర్వాత వివిధ సరిహద్దు ప్రాంతాలలో సైనికుల కోసం ప్రదర్శనలిచ్చి.. అలరించారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సలహాలతో ‘ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ (ఎస్‌ఎస్‌ఐ) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు, పిల్లలకు వైద్య సేవలు అందించారు.
జీవిత చరిత్ర ఆధారంగా..
1980వ సంవత్సరంలో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. 1981వ సంవత్సరం లో పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించా రు. నర్గీస్ దత్ మరణానంతరం సునీల్ దత్ ‘నర్గీస్‌దత్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పట ల్’, ‘నర్గీస్ దత్ మెమోరియల్ ఫౌండేషన్’ను కూడా స్థాపించారు. నర్గీస్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ది లైఫ్ అం డ్ టైమ్స్ ఆఫ్ నర్గీస్’ను టీజేయస్.జార్జ్ రాశారు. అలాగే ‘మిస్ట ర్ అండ్ మిసెస్ దత్: మెమోరీస్ ఆఫ్ అవర్ పేరెంట్స్’ని నర్గీస్ కుమారైలు రాశారు.
ఆర్కే లోగో..
బర్సాత్ మూవీలోని ఒక సన్నివేశంలో రాజ్ కపూర్ ఒక చేతిలో నర్గీస్‌ను మరో చేతిలో వయోలిన్ పట్టుకుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. దాని ఆధారంగా ‘ఆర్కే’ ఫిల్మ్స్ లోగోను డిజైన్ చేశారు.
ముంబైలోని బాంద్రాలో ఒక వీధికి ఆమె జ్ఞాపకార్థంగా నర్గీస్ దత్ రోడ్ అని పేరు పెట్టారు. నర్గీస్ గౌరవార్థం ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్ రూపాయి విలువ గల స్టాంప్ ను ముద్రించింది.