calender_icon.png 5 December, 2024 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్ల్‌ఫ్రెండ్‌గా మెప్పిస్తుందట

04-12-2024 12:03:25 AM

పుష్పరాజ్‌తో జత కట్టి శ్రీవల్లిగా మెప్పించింది రష్మిక మందన్న. అభిమానుల గుండెల్లో నేషనల్ క్రష్‌గా స్థానాన్ని పదిలపర్చుకుంది. ఒక్క ఫ్యాన్స్ మనసు దోచుకోవడమే కాదు.. సినీ ప్రముఖుల దగ్గరా మంచి మార్కులు కొట్టేస్తోంది రష్మిక. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోందంటే వృత్తిలో పరిపక్వత సాధించి, నటనలో తనదైన రీతిలో మెప్పించేలా రాణిస్తోందని అర్థం. డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. “డైరెక్టర్ రాహుల్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ చూపించాడు. అందులో రష్మిక పర్‌ఫార్మెన్స్, క్లోజప్ షాట్స్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. రాహుల్ తన యాక్టర్స్‌ను బాగా సెలెక్ట్ చేసుకుంటాడు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు సుకుమార్. మెప్పించే రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమానే ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఓ అందమైన, వైవిధ్యమైన ప్రేమకథతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు.

నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్; సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్; కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ; ప్రొడక్షన్ డిజైన్: ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి; నిర్మాణం: ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి; రచన -దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.