‘పేక మేడలు’ సినిమాలో హీరోయిన్ ఓ డైలాగ్ అంటుంది.. ‘అప్పుడు సక్కగా చదివి ఉంటే.. ఇప్పుడు ఈ కష్టాలు ఉండకపోయేవి’ అని. ఈ డైలాగ్ ఇప్పటి తల్లిదండ్రులకు వినిపించాలని.. విద్యార్థుల తల్లుల్ని ఇంటికి పిలిచి.. ఆ మూవీ చూపించడమే కాదు.. ఆ డైలాగ్‌ను వినిపించి ఒక్కటే మాట చెప్పా.. ‘మీ భవిష్యత్ మీ చేతుల్లో నుంచి చేజారిపోయింది..
కనీసం మీ పిల్లల భవిష్యత్‌ను చక్క బెట్టండి’ అని చెబుతున్నారు కేంద్రీయ విద్యాలయం రిటైర్డు టీచర్ రేణుకా దేవి. రిటైర్మెంట్‌ను ఒక కొత్త అడ్వంచర్‌గా తీసుకొని ‘కామన్ స్కూల్ అసోసియేషన్’ ద్వారా బస్తీల్లో పిల్లలకు విద్యాతో పాటు విలువలను నేర్పిస్తున్నారు రేణుకా దేవి. తన 30 ఏళ్ల టీచింగ్ అనుభవాన్ని విజయక్రాంతితో పంచుకున్నారామె..
మాది ఖమ్మం.. పుట్టి పెరిగిందంతా అక్కడే.. తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చాం. అలా ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ పూర్తి చేశా.. తర్వాత కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం వచ్చా క.. ప్రేమ వివాహం చేసుకున్నా.. ఆ కాలం లో ప్రేమ వివాహం అంటే పెద్ద సాహసం.
మా పెళ్లి కారణంగా కొంత కాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇద్ద రు కూమారులు. నాకు చిన్నప్పటిన్నుంచి టీచర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. అదే అయ్యా. అలా ఉపాధ్యాయురాలిగా 30 ఏళ్ల అనుభవం.. పిల్లలతో ఉన్న అనుబంధం రిటైర్మెంట్ తర్వాత పోకుండా ముందే ప్లాన్ వేసుకున్నా.
టీచింగ్ ఓ ఫ్యాషన్..
రిటైర్మెంట్ కంటే ముందు నుంచి రకరకాల పరిస్థితుల వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో తిరిగా. టీచింగ్ అనేది ఒక ఫ్యాషన్‌గా తీసుకున్నా. డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా.. అడ్మిని స్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఉద్యోగాలు వచ్చాయి. కానీ నేను ఒక్కటే అనుకున్న స్కూల్ స్థాయిలోనే టీచర్‌గా ఉండాలి అని. రిటైర్మెంట్ కంటే ఒక పదేళ్ల ముందు నుంచే నన్ను రెండు ప్రశ్నాలు వెంటాడేవి.
రిటైర్మెం ట్ అనేది ఇంటి పని నుంచా?.. టీచింగ్ నుంచా? అని ప్రశ్నించుకోవడం మొదలెట్టా! ఎట్టి పరిస్థితుల్లో టీచింగ్ నుంచి అయితే రిటైర్మెంట్ తీసుకోలేను. ఎందుకంటే వృత్తి, ప్రవృత్తి రెండు అవే కాబట్టి. అలా అనుకొని పిల్లల నుంచి దూరంగా ఉండటాన్ని నేను ఊహించుకోలేకపోయా.
రిటైర్మెంట్ అయినా కానీ పాఠాలు ఎక్కడి నుంచైనా చెప్పుకొవచ్చు. ఏ చెట్టు కింద కూర్చొనైనా పాఠాలు చెప్పుకోవచ్చు. అలా టీచింగ్, లార్నింగ్ నుంచి రిటైర్మెంట్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు.
మరో అడ్వంచర్‌గా భావించా!
కేంద్రీయ విద్యాలయం నుంచి రిటైర్డు అవుతున్న అంటే చాలా సంతోష పడ్డా. ఎందుకంటే అదొక ఫిక్డ్స్ మోడల్లో నడుస్తున్న విద్యా విధానం. ఇలాగే పాఠాలు చెప్పాలి? ఇంతే సిలబస్ చెప్పాలి? ఇన్నీ పీరియడ్సే తీసుకోవాలి? ఎగ్జామ్స్ నిర్వహించాలి? పేపర్లు దిద్దాలి? అని ఒక ఫిక్స్ మోడల్లో ఉంటుంది. అది నాకు నచ్చదు. రిటైర్డు అవుతే.. ఎన్నో విషయాలను పిల్లల కు నేర్పించొచ్చు అనే ఉత్సాహంలో ఉండేదాన్ని.
రిటైర్మెంట్ తర్వాత ఒక కొత్త అడ్వం చర్‌గా జీవితాన్ని మొదలు పెట్టాను. ఒక ఫ్రెండ్ ద్వారా విజయవాడ దగ్గర ఉన్న ‘హిల్ ఫ్యారడైజ్’ అనే అనాథశ్రమంకు వెళ్లా. అది మంచి లోకేషన్‌లో ఉంది. ఒక పెద్ద గుట్టపై.. చెరువులు, పొలాల మధ్యలో ఉన్నది. అది చూశాక అక్కడే పిల్లల మధ్య ఉండాలనిపించింది. అయితే నాకు ఇద్ద రు కొడుకులు. నా చిన్న కొడుక్కి ఆటిజం ఉంది.
వాడిని తీసుకొని అక్కడికి పోయా.. మా పిల్లవాణ్ణి ఉండనిస్తే.. నేను ఉంటానని చెప్పా. వాళ్లు దానికి అంగీకరించారు. నేను వెళ్లే సమయంలో 54మంది విద్యార్థులు చదువుల్లో వెనుకబాడటం మూలంగా వాళ్లను ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. ఏలాగైనా పదోతరగతి పాస్ చేయించాలని వాళ్ల ఉద్దేశ్యం. ఆ పిల్లల్ని నాకు అప్పగించండి అని అడిగా.. అందుకు వాళ్లు ఒప్పుకున్నారు.
అలా 54 మంది విద్యార్థుల్లో ఒక ఆరు మంది తప్ప.. మీగతా 48 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక దాని తర్వాత కొవిడ్ వస్తే మళ్లీ వెనక్కి వచ్చేశా.! ఆ సమయంలో అర్థమైంది పిల్లల చదువు బాగా పాడైందని. దాంతో మా ఇంటి టెర్రస్ పై చిన్న సెడ్ వేసుకొని ఒక పదిమంది పిల్లలతో టీచింగ్ మొదలు పెట్టా. దానికోసం స్కూల్స్ మానేసిన విద్యార్థులను మళ్ళీ..
స్కూల్లో రికనెక్టు చేయడం మొదలు పెట్టా. స్కూల్ అయిపోగానే నా దగ్గరకు తీసుకొని వచ్చి చదివించ డం మొదలు పెట్టా. అలా ఒక సంవత్సరం చేస్తూ ఉండగా.. ప్రొఫెసర్ పద్మజా షా, క్రై ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్న హిమ బిందు, జర్నలిస్టు జ్యోతి, రెహ్మాన్ ఇలా అందరం కలిసి 2022లో ‘కామన్ స్కూల్ అసోసియేషన్’ అని స్టార్ట్ చేశాం.
అపరిమితమైన తెలివితేటలు..
పిల్లల్లో అపరిమితమైన తెలివితేటలు ఉంటాయి. కానీ పరీక్ష రాసి మంచి మార్కు లు సాధించే శక్తిసామర్థ్యాలు ఉండవు. ఉండకపోవడానికి ప్రధాన కారణం భాష మీద పట్టు లేకపోవడం. తెలుగు వ్యాకర ణం పూర్తిగా నేర్చుకోరు.. దాంతో తక్కువ పదాలు నేర్చుకుంటారు. మా స్కూల్లో ముఖ్యంగా చదువు కోసం ఏ మాత్రం ఖర్చు పెట్టలేని కుటుంబంలోని పిల్లలను మాత్రమే తీసుకుంటాను.
క్లాసు రూమ్‌లో టీచర్..
మా ఉద్దేశ్యం ఏమిటంటే.. ఒక 30 మం ది విద్యార్థులను ఒక దగ్గర కూర్చొబెట్టి పాఠాలు చెప్పాలి అనుకోలేదు. మొదటి నుంచి నేను చెప్పేది ఒక్కటే.. టీచర్ క్లాస్ రూమ్‌కు ఒక గుండెకాయ లాంటిది. ఆ గుండె మంచిగా కొట్టుకోవాలి.. ఆరోగ్యం గా ఉండాలి. ఒక 15 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయించాం. నా దృష్టిలో హోం వర్క్‌లు అన్నీ కూడా లేబర్ వర్క్‌తో సమా నం.
పేక మేడలు సినిమా..
పేక మేడలు.. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. “ఆరోజు సక్కగా చదువుకుం టే.. ఇవాళ నాకు ఈ పరిస్థితి ఉండేది కాద ని” ఈ డైలాగ్ కోసం ఒక పదిమంది అమ్మ ల్ని ఇంటికి పిలిపించి.. సినిమా హాల్లో ఉండే విధంగా మధ్యమధ్యలో చాయ్‌లు, కాఫీలు ఇచ్చి.. ఆ సినిమా చూపించాను. ఎందుకంటే ఆ డైలాగ్ కచ్చితంగా అంద రూ వినాలని.. ఆ డైలాగ్‌ను పాజ్ చేసి చూపించాను.
ఆ సినిమా చూపిస్తూ.. అందరికీ ఒక్కటే మాట చెప్పా.. ‘మీ జీవితా లు ఎలాగో మీ చేతుల్లో నుంచి చేజారిపోయింది.. కనీసం మీ పిల్లల జీవితాలనైనా చక్క బెట్టండి’ అని చెప్పాను. విద్యార్థులకు సెల్ఫ్ లర్నర్స్‌గా చేయడం అవసరం. ప్రతిదానికి టీచర్ మీద ఆధారపడకుండా చదువుకోవాలి. దాంట్లో సక్సెస్ అయ్యాం.
సమస్య ఎక్కడ ఉందో గ్రహించాలి!
మా ఇంటిపై పూర్తి స్థాయిలో చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ప్రస్తుతం నాలుగు సెంటర్లు నడుస్తున్నా యి. ఒకటి మోతినగర్‌లో, రెండొది ఆల్వాల్‌లో.. రాచకొండలో రెండు సెంట ర్లు ఉన్నాయి. ఈ సెంటర్లు కామన్ స్కూ ల్ అసోసియేషన్ కిందే పని చేస్తున్నాయి.
30 ఏండ్లు టీచింగ్ ఫీల్డ్‌లో ఉండటం.. నాకొక ఆటిజం అబ్బాయి వల్ల.. చదువు ల్లో వెనుకబడ్డ పిల్లలను అర్థం చేసుకునే స్కిల్ వచ్చేసింది. మా అబ్బాయి క్లినికల్‌గా మెంటల్ డిసీజ్ ఉన్న పిల్లవాడు. వాడినే ట్రైన్ చేశాను.. ఈ పిల్లలను ట్రైన్ చేయడం నాకు ఇంకా సులువు అనిపించింది. కాకపోతే.. వాళ్ల సమస్య ఎక్కడ ఉందో కరెక్టుగా అర్థం చేసుకోవాలి.
ఇది తల్లిదండ్రుల తప్పే!
తల్లిదండ్రులకు ఉండే సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు అనేది చివరి ప్రయారిటీ అనుకునేదాన్ని. కానీ నేను కామన్ స్కూల్ పెట్టాక తెలిసింది. అసలు తల్లిదండ్రుల చదువు ప్రయారిటీయే లేదని తెలిసింది. ఎందుకంటే నేను ఒక పది రోజులు కష్టపడి కూర్చొని ఒక విద్యార్థికి అ నుంచి బండిరా వరకు నేర్పి..
తర్వాత పదాలు పలికే స్టేజీలో పది రోజులు ఊరికి తీసుకెళ్లి పోతారు.. దీనికి సవా లక్ష కారణాలు చెబుతారు. పిల్లల అటెండెన్స్ అనేది చాలా ముఖ్యం. తల్లిదండ్రుల నిర్ణయాల్లో పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలనిఎక్కడ కనిపించలేదు. దానిపై కనీస అవగాహన తల్లిదండ్రులకు లేదు.
- రూప