calender_icon.png 12 January, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె.. అతడిగా మార్పు

11-07-2024 01:48:37 AM

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించిన ఐఆర్‌ఎస్ అధికారి

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఓ మహిళ తన పేరును పురుషుడి పేరులా, లైంగికతను పురుషుడి గా మార్చుకుంటూ రికార్డులను మార్పించు కున్నారు. ఇ కపై తనను పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మం త్రిత్వశాఖను అభ్యర్థించారు. చైన్నెకి చెందిన అనసూయ 2013లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌శాఖలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తి స్తున్నారు. తాజాగా ఆమె తన పేరును అనుకతిర్ సూర్య గా, లైంగికతను పురుషుడిగా మార్చుకుంటానని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు విన్నవించుకోగా, మంగళవారం ఆమె అభ్యర్థనను అంగీకరిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.