- విచారణలో ఫిర్యాదుదారుపై జానీమాస్టర్ ప్రత్యారోపణలు
- నేటితో ముగియనున్న కస్టడీ.. కోర్టుకు అప్పగింత
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 27: అత్యాచారం ఆరోపణలతో నార్సింగి పోలీసుల కస్డడీలో ఉన్న జానీ మాస్టర్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఫిర్యాదుదారే తనను వేధించినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. కాగా జానీమాస్టర్ అసిస్టెంట్‌గా ఉన్న ఓ యువతి ఫిర్యాదుమేరకు ఆయనపై ఇటీవల నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
పరారీలో ఉన్న ఆయన్ను ఈనెల 19న గోవాలో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నార్సింగి పోలీసులు ౫రోజులు కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు అనుమతి మంజూరు చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది సమక్షంలో ప్రస్తుతం జానీమాస్టర్ విచారణ కొనసాగుతోంది.
శుక్రవారం చేపట్టిన విచారణలో జానీమాస్టర్ కీలకమైన అంశాలు వెల్లడించినట్లు సమాచారం. శనివారంతో జానీమాస్టర్ కస్టడీ గడువు ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను తిరిగి కోర్టులో అప్పగించనున్నారు.