calender_icon.png 16 January, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రక్షణకు షీ-బాక్స్!

03-09-2024 12:00:00 AM

షీ-బాక్స్.. అంటే ఏమిటి? ఏం చేస్తుంది? ఎలా పని చేస్తుంది? ఇది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే సందేహం చాలామందికి రావచ్చు. దీనికి సంబంధించిన అవగాహన కూడా ప్రతి మహిళకు అవసరం. ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవీ షీ-బాక్స్ పోర్టల్‌ను ప్రారంభించారు. 

షీ-బాక్స్ అంటే ఏమిటి? 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని షీ బాక్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. 

ఏం చేస్తుంది? 

ఇది పని ప్రదేశాల్లో మహిళలకు ఎదుర య్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ఏర్పాటు చేసిన వెబ్‌సైట్. షీ-బాక్స్ పోర్టల్ ద్వారా పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు, వాటి పరిష్కారాలకు ఉపయోగపడుతుంది.

ఇలా పని చేస్తుంది?  

షీ-బాక్స్ పోర్టల్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ, స్థానిక కమిటీలల్లోని ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలకు అనుసంధానమై ఉంటుంది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైన బాధితులు షీ-బాక్స్ పోర్టల్‌లో ఫిర్యాదులు చేయవచ్చు. అంతేకాకుండా ఫిర్యాదుకు సంబంధించిన పరిష్కార స్టేటస్‌ను పరిశీలించుకోవచ్చు. పోర్టల్‌కు నియమించే నోడల్ అధికారి ఫిర్యాదుకు సంబంధించిన పరిష్కారాన్ని కూడా చూసుకోవచ్చు. 

ఎలా ఫిర్యాదు చేయాలి? 

బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఈ లింకు ద్వారా https//shebox.wcd.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అందులో ఫిర్యాదు నమోదును ఎంచుకుని మీ డిటెయిల్స్‌ను పూర్తి చేస్తే సరిపోతుంది.