calender_icon.png 10 February, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబుకు శాత్రాజ్ పల్లి గ్రామస్తులకు కృతజ్ఞతలు

09-02-2025 03:25:27 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజ్ పల్లి గ్రామాన్ని భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కలుపుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. దీంతో గ్రామస్తులు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)కు తమ గ్రామాన్ని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోనే ఉంచాలని కోరారు. దీంతో వారి కోరిక మేరకు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల శాంతి గ్రామాన్ని మళ్లీ ముత్తారం మండలంలోనే కలుపుతూ జీవో తీసుకొచ్చారు. దీంతో శాత్రాజ్ పల్లి  గ్రామస్తులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి  సహకరించిన మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావుకు తమ గ్రామాన్ని మళ్లీ ముత్తారం మండలంలో కలుపుతూ ప్రత్యేక జీవో తీసుకొచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.