calender_icon.png 11 January, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈతరానికి నచ్చే షష్టిపూర్తి

09-01-2025 12:00:00 AM

రూపేశ్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘షష్టిపూర్తి’. నట కిరీటి రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి అర్చన ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇందులో రూపేశ్ సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తోంది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రూపేశ్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “నిజ జీవితంలో నాకు అరవై దాటిన తర్వాత షష్టిపూర్తి పెట్టకుండా తప్పించుకున్నాను. కానీ భగవంతుడు ఊరుకుంటాడా? ఇదిగో ఇలా షష్టిపూర్తి చేశాడు. ఇది సినిమా కాదు.. జీవితం. పుష్ప౨ సినిమాలో హీరో పాత్రపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అల్లు అర్జున్ కలిసినప్పుడు ఇదే విషయంలో ఆన్‌లైన్ వచ్చిన పోస్టులు చూసి నవ్వుకున్నాం.

సమాజంలో మన చుట్కూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై ప్రతిబింబిస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్నీ నెగెటివ్ కోణంలో చూడొద్దు” అని అన్నారు. అర్చన మాట్లాతుతూ.. “చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇంత మంచి కాంబినేషన్‌ను అలోచించి ఒకళ్లు సినిమాను మా దగ్గరికి తీసుకువస్తున్నారంటే.. వారికి ఎంత గొప్ప హృదయం ఉందో తెలుస్తుంది.

అందుకే నేను ఈ సినిమాలో భాగమయ్యాను’ అని తెలిపారు. హీరో రూపేశ్ మాట్లాడుతూ.. “షష్టిపూర్తి’ నా మొదటి సినిమా. అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటున్నా” అన్నారు. డైరెక్టర్ పవన్ ప్రభ మాట్లాడుతూ.. “రూపేశ్ మోరల్స్, ఎథిక్స్ ఉండాలని చెప్పేవారు. ఈ మూడు ఉన్న సినిమా ఏదైనా సరే.. అలా నిలిచిపోతుంది. నేను అలాంటి సినిమా చేయాలనుకున్నాను. అలా ఈ ‘షష్టిపూర్తి’ వచ్చింది” అని చెప్పారు.