calender_icon.png 10 March, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ రెండవ వైస్ గవర్నర్‌గా శశికాంత్

10-03-2025 01:23:27 AM

జడ్చర్ల మార్చి 9 : లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320ఎ రెండవ వైస్ గవర్నర్ గా  డాక్టర్ కె.శశికాంత్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో శనివారం జరిగిన లయన్స్  ఇంటర్నేషనల్  జిల్లా  320ఎ వార్షిక సమావేశంలో గవర్నర్ గా డాక్టర్ మహేందర్ రెడ్డి, ప్రథమ వైస్ గవర్నర్ గా సురేష్ జగ్నాని , రెండవ వైస్ గవర్నర్ గా మహబూబ్ నగర్ కు చెందిన డాక్టర్ కె.శశి కాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ శశికాంత్,  డాక్టరు సబిత దంపతులను శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శశికాంత్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక కు సహరించిన ప్రతి లయన్స్ క్లబ్ సభ్యునికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నటరాజ్, లయన్ జి.రమణయ్య, లయన్ తిరుపతి రెడ్డి, లయన్ శ్రీహరి, లయన్ అశ్విని చంద్రశేఖర్,  లయన్ బాబుల్ రెడ్డి, లయన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.