calender_icon.png 18 January, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైఫ్ పార్ట్‌నర్ ఫొటోలను షేర్ చేస్తున్నారా?

21-09-2024 12:00:00 AM

చాలామంది తమ భావాలను ఇతరులతో షేర్ చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సోషల్ మీడియాను వాడుతున్నారు.  అయితే ఈ క్రమంలో జంటలు కొన్ని తప్పులు చేస్తూ సోషల్ అబ్యూజ్ బారిన పడుతున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోషల్ మీడియాలో ఆ విషయాలను షేర్ చేయకుండా ఉండటమే మంచిది. తాము రిలేషన్‌లో ఉన్నామని చెప్పుకునేందుకు కొందరు ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

కానీ ఈ వ్యవహరం కూడా సమస్యగా మారొచ్చు. ఎందుకంటే ఆ ఫొటోలు  మీ బంధువులు లేదా పరిచయస్తులకు చేరుకోవచ్చు. దాంతో ఇద్దరిపై చెడు ముద్ర పడి రిలేషన్ దెబ్బతింటుంది. ఇక సంబంధాల సమయంలో కూడా చాలామంది వ్యక్తిగత సమాచారమంతా ఇతరులకు తెలియజేస్తారు. ఈ క్రమంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని జంటలయితే తమ వ్యక్తిగత స్క్రీన్‌షాట్స్‌ను వారి స్నేహితులకు పంపుతారు. ఇది కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇక మ్యారేజ్ డే, బర్త్ డే, ఇతర వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటారు.  దీని వల్ల వ్యక్తిగత సమస్యలు ఏర్పడి విడిపోవడానికి దారితీస్తాయి. కాబట్టి వ్యక్తిగత వివరాలు, పర్సనల్ ఫొటోలు షేర్ చేయకపోవడమే మంచిది.