calender_icon.png 24 December, 2024 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

06-10-2024 06:00:33 PM

కరీంనగర్ (విజయక్రాంతి) కరీంనగర్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 39 వ డివిజన్ లోని విద్యానగర్ విజయదుర్గ కాలనీ లో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఎన్నమనేని నిహారిక ప్రకాష్ రావులు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తమ చేతుల మీదుగా వేద మంత్రోచ్చరణల మద్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాలుగవ రోజు లలితా త్రిపురా సుంధరీ దేవి అవతారంలో దర్శన మిచ్చిన దుర్గమాత అమ్మవారికి నిహారిక ప్రకాష్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శివపార్వతులను పల్లకి సేవలో ఊరేగింపు చేశారు. వైభవంగా సాగిన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తదనంతరం కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు నిహారిక ప్రకాష్ రావు దంపతులు అన్నధాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కార్తీక్, రమణారెడ్డి, రత్నాకర్ రెడ్డి, అశోక్ రావు,భూమయ్య, సుధాకర్, డివిజన్ మహిళలు  తదితరులు పాల్గొన్నారు.