calender_icon.png 27 September, 2024 | 12:41 PM

అక్టోబర్ 3 నుంచి శారదా నవరాత్రులు ఆరంభం యా దేవీ.. నమోస్తుతే

27-09-2024 12:00:00 AM

యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా 

నమస్తస్తు ్య నమస్తస్తు ్య నమస్తస్తు ్య నమోనమః 

- దేవీ సప్తశతి: 5---3 -

‘సకల చరాచర భూతకోటిలో శక్తిరూపంగా వున్న పరాశక్తి దేవికి ముమ్మారు నమస్కారం’. ఆమెనే సర్వజీవులకు ఆధారం. ఆ శక్తియే సృష్టి, స్థితి, లయాది కార్యాలకు మూలం. ఆమె సాకార రూపం గురించి ‘దేవీ మహత్మ్యం’ వివరించింది. ఈ శక్తి మానవునిలో ఏన్నో విధాలుగ ప్రత్యక్షమవుతుంది. జగత్తులో చైతన్యశక్తిగా బుద్ధి, నిద్ర, క్షుద, ఛాయ, శక్తి, తృష్ణా, క్షాంతి, జాతి, లజ్జా, శాంతి, శ్రద్ధా, కాంతి, లక్ష్మి, వృత్తి, స్మృతి, దయ, తుష్టి, మాతృ, భ్రాంతి ఇత్యాది సర్వమానవ ప్రవృత్తులూ ఆమెనుండే జనిస్తాయి.

చైతన్యంలో అన్ని మనోప్రవృత్తులు ఆమె రూపాలే. అసలు, మనస్సే ఆ పరాశక్తి రూపాంతరం. ‘శ్రీ దేవీ నవరాత్రులు’ పేర ఆసేతు హిమాచల పర్యంతం ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు హైందవులు పరాశక్తి దేవిని అర్చిస్తారు. ఇవే ‘శరన్నవరాత్రులు’. అంటే, శరత్కాలంలో వచ్చేవి. 

లలితాదేవి నుంచి అపరాజిత వరకు..

నవరాత్రులలో మొదటిరోజున ‘లలిత’గా, రెండో రోజున భిక్షనొసగే ‘అన్నపూర్ణమ్మ’గా, జ్ఞానేక్షురసాన్ని అందించే ‘రాజరాజేశ్వరి’గా మూడవ రోజు, సింహవాహిని ‘పార్వతి’గా నాల్గవరోజు, అష్టుశ్వైర్యాలనిచ్చే ‘మహాలక్ష్మి’గా ఐదవ రోజు, ‘పంచముఖ గాయత్రి’గా ఆరవ రోజు, సప్తమీ తిథిలో మూలా నక్షత్రాన ‘సరస్వతి’గా ఏడవ రోజు, అష్టకష్టాల్ని తొలగించే ‘దుర్గ’గా ఎనిమిదవ రోజున, మహార్నవమిన ‘మహిషాసుర మర్దిని’గా తొమ్మిదవ రోజున, ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు విజయాన్ని ప్రసాదించే ‘అపరాజితాదేవి’గా పూర్ణకాంతులతో అమ్మవారు దర్శనమిస్తుంది. 

దేవి పరాశక్తియే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా ప్రాదుర్భావం చెందినట్లు పురాణాలు చెబుతున్నాయి. మధుకైటభులను, మహిషాసురుని, శుంభనిశుంభులను ఎలా సంహరించిందో చెప్పే గాథయే ‘దేవీ మహాత్మ్యం’. ‘శ’ అంటే ఐశ్వర్యం, ‘క్తి’ అంటే పరాక్రమం. ఈ రెంటినీ ప్రసాదించే దేవత ఆమె. ‘మార్కండేయ పురాణం’లోని ‘దేవీ మహత్మ్యం’లోని ‘సప్తశతి ప్రకరణం’ పంచమాధ్యాయంలో ఆమె విశ్వరూప సందర్శనం ఉంది. చేతన, బుద్ధి, నిద్ర, క్షుదా, ఛాయా, శక్తి, తృష్ణా, క్షాంతి, జాతి, లజ్జ, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, వృత్తి, స్మృతి, దయ, తుష్టి, మాతృ, భ్రాంతి రూపాలన్నీ ఆమెవే. 

దుర్గాదేవి తొమ్మిది అవతారాలు 

1. శైలపుత్రి: భౌతిక సంపదకు దేవత. ఆమె నాలుగు చేతులతో సింహముఖ స్త్రీగా చిత్రీకృతమైంది. ప్రతి చేతిలో పూలతో చేసిన పాము, నాల్గవ చేతిలో కత్తి, విల్లు ధరిస్తుంది. 2. బ్రహ్మచారిణి: ఇది 3 గుణాలను సూచిస్తుంది. సత్వ, రజస్సు, తమస్సు. అదనంగా, ఆమెకు వరుసగా జ్ఞానం, చర్య, జ్ఞానాన్ని సూచించే నాలుగు కళ్ళు ఉన్నాయి. 3. చంద్రఘంట: ఆమె శౌర్యం, ధైర్యానికి అంతిమ స్వరూపం. నవరాత్రి మూడవ రోజున ఆమెను పూజిస్తారు. ఇంకా, ఆమెకు శివుని శక్తి ఉందని నమ్ముతారు.  4. కూష్మాండ: అందమైన ముఖం కలిగింది.

ఇది మూలాధార చక్రం లేదా నాభికి దిగువన ఉన్న శక్తి కేంద్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈమె అదృష్టం, శ్రేయస్సు వ్యక్తిత్వంగా సూచిస్తుంది. 5. స్కంద మాత: పులి చర్మాన్ని ధరించి, పవిత్రతకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక అయిన తామరపువ్వును మోస్తూ, పులిపై స్వారీ చేస్తుంటుంది. దుష్టులకు వ్యతిరేకంగా జరిగే అన్ని సైనిక కార్యకలాపాలకు ఈ తల్లి బాధ్యత వహిస్తుంది. 6. కాత్యాయని: ఒక్క చూపుతో ఎలాంటి రాక్షసుడిని లేదా శత్రువునైనా సంహరిస్తుంది. చెడు, బలం, జ్ఞానంపై విజయాన్ని సూచిస్తుంది.

7. కాళరాత్రి: ఈమె పులిగా వర్ణితమైంది. పెద్ద నోటితో భయంకరంగా కనిపిస్తుంది. ఈ అవతారాన్ని కాళి అని పిలుస్తారు. మహిషాసురమర్దిని. 8. మహాగౌరి: మహిషాసురమర్దినిని చంపిన తర్వాత దుర్గాదేవి తీసుకున్న శాంతరూపం ఇది. ఈమె తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుంది. తెల్లటి పూలతో ముఖ్యంగా మల్లెపూలతో మహాగౌరీ పూజ చేస్తారు. 9. సిద్ధిధాత్రి: ఈ దేవి కమలంపై కూర్చుని ఉంటుంది. గద, చక్ర, శంఖ, కమలం వంటి నాలుగు చేతులున్నాయి. సిద్ధిని, నిధినే కాక జ్ఞానారోగ్యాలను ప్రసాదిస్తుంది.