నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు సీతక్క, ఉత్తమ్
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ళ శారద గురువారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బుద్ధభవన్ కార్యాలయంలో బుధవారం ఆమె కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అంనతరం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి చైర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలి పారు.
మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు కృషి చేస్తానన్నారు. మహిళా కమిషన్ సమీక్ష అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన శారదకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శారద చేసిన సేవలను జాతీయ నాయకత్వం గుర్తించి బాధ్యతలు అప్పగించిందని, మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు అద్భుతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.