29-03-2025 12:24:53 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని 65 ప్రాంతంలో డంపింగ్ యార్డ్ కోసం చెత్త ర్యాలీల ద్వారా చెత్తను డంపు చేయడానికి వచ్చిన మున్సిపల్ ట్రాలీ లను శనివారం బస్తీ ప్రజలు ముకుమ్మడిగా అడ్డుకున్నారు. తమ బస్తీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనిచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గల రైతు మార్కెట్ లో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డ్ కు వెంటనే తొలగించాలని బూడిదగడ్డ బస్తి ప్రజలు ఆందోళన చేయడంతో అక్కడి నుండి చెత్తను శాంతిఖని 65 డిప్ ప్రాంతానికి తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. అక్కడి ప్రజలు విషయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకురావడంతో ప్రసాద్ ద్వారా కమిషనర్ తో మాట్లాడి చెత్త డంపింగ్ ని నిలిపివేయించారు. దీంతో 65 డిప్ ప్రజలు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు కృతజ్ఞతలు తెలిపారు.