calender_icon.png 29 April, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ వైస్ చైర్మన్‌గా శాంతికుమారి

29-04-2025 12:00:00 AM

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సీఎస్ శాంతి కుమారికి ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ (మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ) వైస్ చైర్మన్‌గా కొత్త బాధ్యతలను అప్పగిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30న శాంతి కుమారి పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గానూ శాంతి కుమారికి అదనపు బాధ్యతలు అప్పగించింది.