24 May, 2026 | 2:44 PM

Breaking News

భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •  

శాంతారామ్ రెండో భార్యగా..

10-12-2025 01:47 AM

భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన సుప్రసిద్ధ దర్శకుడు, నటుడు, నిర్మాత వీ శాంతారామ్ జీవితం ఆధారంగా దర్శకుడు అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ డ్రామాకు ‘వి. శాంతారామ్’గా ఖరారు చేశారు మేకర్స్. రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరిత అశ్విన్ వర్ధే నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్‌లో టైటిల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సిద్ధాంత్ చతుర్వేది ఫస్ట్‌లుక్‌ని ఇప్పటికే విడుదల చిత్ర బృందం తాజాగా కథానాయికను పరిచయం చేసింది.

ఇందులో హీరోయిన్‌గా తమన్నా భాటియా నటించబోతున్నట్టు ప్రకటించారు. తమన్నా ఇందులో శాంతారామ్ రెండోభార్య జయశ్రీగా కనిపించను న్నట్టు నిర్మాతలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. జయశ్రీ రోల్‌లో తమన్నా రెట్రో లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నటి జయశ్రీ అప్పట్లో ‘డాక్టర్ కుట్నీస్ కీ అమర్ కహానీ’, ‘శాకుంతల’, ‘చంద్రరావ్ మోర్’, ‘దహేజ్’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.