calender_icon.png 26 October, 2024 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.10 వేల కోట్ల రతన్ టాటా వీలునామాలో శంతను

26-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: వాణిజ్య దిగ్గజం దివంగత రతన్ టాటా తన రూ. 10,000 కోట్ల ఆస్తులకు రాసిన వీలునామాలో ఆయనకు కొద్ది ఏళ్లుగా అత్యంత సన్నిహితుడిగా ఉన్న శంతను నాయుడుకు చోటు దక్కింది. అలాగే టాటా పెంపుడు శునకం ‘టిటో’ సంరక్షణకు సైతం వీలునామాలో కేటాయింపులు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెలువడ్డాయి.

శునకాల పట్ల ప్రేమే టాటా, పూనెకు చెందిన యువకుడు శంతను నాయుడి మధ్య స్నేహానికి ప్రధాన కార ణం.శంతను వృద్ధుల కోసం నెలకొల్పిన గుడ్ ఫెలోస్ స్టార్టప్‌లోనూ, ఇతర సామాజిక ప్రాజెక్టుల్లోకు రతన టాటా ఆర్థిక మద్ద తును అందించారు. గుడ్‌ఫెలోస్‌లో రతన్ టాటా తన వాటాను శంతను నాయుడికి ఇ స్తూ వీలునామా రాశారు.

అలాగే యూఎస్‌లో ఉన్నత విద్యాభ్యాసం కోసం శం తనుకు ఇచ్చిన ఖర్చుల్ని రద్దు చేశారు. రతన్ టాటా రూ. 10,000 కోట్ల ఆస్తుల వీలునామాలో ఆలీబాగ్‌లో పావు ఎకరం వైశాల్యం లో విస్తరించిన పెద్ద బంగళా, ముంబైలో రెండు అంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకుపైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటాల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో 0.83 శాతం వాటాలు తదితరాలు ఉన్నాయి.

టాటా సన్స్‌లో తన వాటాను టాటా ఎండోమెంట్ ఫౌండేషన్‌కు బదిలీ చేయాలని వీలునామా రాశారు. శంతను నాయుడు ప్రస్తుతం టాటా ట్రస్టుల్లో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ రతన టాటా వ్యవహారాలను చూస్తుంటారు. ఉద్యోగంకాకుండా పలు సామాజిక సంబంధిత ప్లాట్‌ఫామ్స్‌ను, సర్వీసుల్ని నిర్వహిస్తుంటారు.

వాటిలో కొన్ని రతన్ టాటా ఆలోచనల్లోంచి పుట్టినవే. వాటిలో ముఖ్యమైనది సీనియర్ సిటిజన్లకు యువత తోడుగా వ్యవహరించే గుడ్‌ఫెలోస్ వెంచర్. ఈ చందా ఆధారిత వెంచర్ 2022లో ప్రారంభించారు. ఇందులో రతన్ టాటా బయటకు వెల్లడికాని మొత్తాన్ని పెట్టుబడి చేశారు.